హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ సినిమాలకు కెరాఫ్ అన్న విషయం తెలిసిందే.. తెలుగు, తమిళ్ లో విశాల్ సినిమాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే రియల్ యాక్షన్ ను చూపించ హీరో అని అందరికి తెలిసిందే..అయితే ఆయన చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు అతనికి ప్రమాదాన్ని కూడా తెచ్చి పెట్టాయి.యాక్షన్ సినిమాలకు డూప్ లేకుండా హీరోలు చేస్తున్నారు. చిన్న హిరొలు మాత్రమే కాదు నాగర్జున లాంటి స్టార్ హీరోలు కూడా అలానే చేస్తున్నారు.


ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ ను అందు కోవడం కోసం సాహసాలు చేస్తున్నారు.కొన్ని మంచిగా ఉంటే మరి కొన్ని సినిమాలు మాత్రం రిస్క్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా హీరో విశాల్ చేస్తున్న సినిమా కూడా భారీ యాక్షన్ సినిమా.యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం కొంతమంది హీరోలు నిజంగా రిస్క్‌ చేస్తారు. అలాంటి హీరోల్లో విశాల్‌ ఒకరు. చాలా వరకు విశాల్ ఫైట్ సీక్వెన్స్ లలో డూప్ లేకుండానే చేసి అభిమానులను మెప్పిస్తాడు.ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ల వల్ల ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్‌.


ప్రస్తుతం విశాల్ లాఠీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. గతంలో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడ్డాడు. అప్పుడు కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా మరోసారి ఇదే సినిమా షూటింగ్‌లో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 'లాఠీ' సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్స్‌ హైదరాబాద్ లో తెరకెక్కుస్తుండంగా ప్రమాదం చోటు చేసుకొని విశాల్ కి గాయాలయ్యాయి. దీంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్రమాదంతో సినిమా మరింత ఆలస్యం అవనుంది...ఎక్కువ ప్రమాదం జరగలెదని త్వరలోనే ఆయన కోలుకుంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది..


మరింత సమాచారం తెలుసుకోండి: