జూన్ నెలలో అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే అలా విడుదల అయిన సినిమాల్లో కొన్ని సినిమాలపై మాత్రమే ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు పెట్టుకున్న కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలా జూన్ నెలలో విడుదల అయి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన సినిమాల గురించి తెలుసుకుందాం.

అంటే సుందరానికి : నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ సినిమా సెకండ్ ఆఫ్ చాలా బాగున్నప్పటికీ , ఫస్టాఫ్ స్లో అయ్యింది అని నెగిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.


విరాట పర్వం : దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలతో విడుదలయిన విరాటపర్వం సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.


సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన సమ్మతమే సినిమా జూన్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.


గాడ్సే : సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమా జూన్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలైయింది.


చోర్ బజార్ : పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా జూన్ 24 వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: