కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ వస్తున్నాడు.ఇకపోతే  పటాస్ సినిమాతో గాడిలో పడి అక్కడి నుంచి వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు.ఇదిలావుంటే తాజాగా మరో కొత్త కథతో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇక రాజ్యాలు, రాజులతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రస్తుత కాలానికి సంబంధించి ఉండేలా అద్భుతమైన కథతో బింబిసార అంటూ రాబోతున్నాడు.ఇకపోతే తాజాగా బింబిసార ట్రైలర్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకులని ఆకట్టుకొని అంచనాలని పెంచేసింది.

అయితే  ఈ సినిమాలో బింబిసారుడు అనే రాజుగా కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనని కనబరిచినట్టు తెలిసిపోతుంది.ఇక  ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ లుక్ కూడా మార్చాడు. అయితే  ఇక బింబిసార సినిమా మూడు పార్టులు ఉంటుందని, వచ్చే సంవత్సరం బింబిసార 2 వస్తుందని ముందే చెప్పేసారు. పోతే దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇకపోతే సోమవారం సాయంత్రం బింబిసార ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఆయన...”నేను, ఎన్టీఆర్ అన్ని కుదిరితే బింబిసార నెక్స్ట్ పార్ట్స్ లో కచ్చితంగా కలిసి నటిస్తాం” అని అన్నారు.

ఇక  దీంతో బింబిసార 2 లేదా బింబిసార 3 లో కచ్చితంగా కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ వార్త విని ఎన్టీఆర్ అభిమానులతో పాటు, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా  నందమూరి అన్నదమ్ములని తెరపై ఒకే సారి చూడాలని ఎదురుచూస్తున్నారు.ఇక దీనికోసం ప్రేక్షకులు ఎప్పుడా అని చూస్తున్నారు.ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమాని కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెలకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఇంకా ఇప్పటికి సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై క్లారిటీ లేదు.ఇక సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: