బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాటలివి.. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు పార్టీలు,  పబ్బులు అంటూ ఫుల్లుగా చిల్లవుతున్నారే తప్ప ఇండస్ట్రీకి వచ్చే ఆలోచనలో లేరు అన్నట్లుగా స్పష్టం అవుతుంది. కానీ కొంతమంది స్టార్ హీరోల పిల్లలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి విజయం సాధించాలని ఆలోచనలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఏర్పాటు చేసే నైట్ పార్టీలకు కొత్త తరంతో పాటు సీనియర్ వాళ్లు కూడా విచ్చేస్తూ ఉంటారు. ఇక స్టార్ కిడ్స్ అంతా ఒకే చోట చేరి పార్టీలు చేసుకునే కల్చర్ అక్కడ బాగా పాపులర్ అవుతోంది.. ఈ పార్టీలకు అజయ్ దేవగన్ -  కాజోల్ దంపతుల  కుమార్తె నైసా దేవగన్ కూడా మినహాయింపు కాదు.

అయితే నైసా పేరుకు తగ్గట్టే టీనేజ్ లో  చాలా నైస్ గా కనిపిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈమె చాలా అందంగా తల్లిని మించిన అందంతో చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. తల్లిలాగే హీరోయిన్  అవుతుందో లేదో  క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వట్లేదు.. అయితే ఈమె పక్కా పార్టీ గర్ల్ అనడంలో సందేహం లేదు . ఎప్పుడూ కూడా పార్టీలు,  పబ్బులు అంటూ వెళుతుంది కానీ సినిమా వైపు తన ముఖాన్ని కూడా చూపించడం లేదు. అందుకే అజయ్ దేవగన్ అభిమానులు , కాజాల్ ఫ్యాన్స్ కూడా తమ కూతురు ఎప్పుడు పార్టీల వెంటే తిరుగుతుందా లేక హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు..

ఇక నైసా దేవగన్ తరచూ అర్జున్ రాంపాల్ కూతురు మహికా రాంపాలతో కలిసి పార్టీలకి హాజరవుతూ ఉంటుంది అంతేకాదు క్లబ్ పబ్బు వెకేషన్ ఇలా ప్రతిదీ కూడా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని లండన్ లో దువా లిపా కచేరి నుండి నైసా పార్టీ చేసుకుంటున్న ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.  ఇక ప్రస్తుతం నైసా దేవగన్ జాన్వితోపాటు షానయా కపూర్ తో కూడా వెకేషన్ లకు వెళుతూ ఉంటుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: