విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ ఎన్నో అంచనాల నడుమ గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం  మన అందరికి తెలిసిందే. 

మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్  గా తెరకెక్కిన ఈ మూవీ విడుదల అయిన మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ మూవీ మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజుతో  40 రోజుల ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇలా విజయవంతంగా ఎఫ్ 3  సినిమా 40 రోజులు కంప్లీట్ చేసుకొని 50 రోజుల వైపు దూసుకు వెళ్తున్న సందర్భంగా తాజాగా ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ ల గురించి చిత్ర బృందం తెలియజేసింది. ఈ పోస్టర్ ద్వారా ఎఫ్ 3 చిత్ర బృందం ఈ సినిమా 70.94 కోట్ల షేర్ ను , 134 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ ఈ మూవీ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మూవీ కి రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: