టాలీవుడ్ లో ఎవరైనా సరే సక్సెస్ అయితేనే గౌరవం ఉంటుంది. అంతే కానీ ఫెయిల్యూర్ లు తలుపు తడుతుంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఈ విషయం చాలా సార్లు రుజువయింది. ఎందరో స్టార్ లు తమ లైఫ్ లో ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడ్డారు. అయితే ఇపుడు ఇదే పరిస్థితిలో హీరో గోపీచంద్ ఉన్నాడు. ఇతనికి గత కొంత కాలంగా సరైన హిట్ పడక కష్టాల్లో ఉన్నాడు. అయితే ఈ మధ్య అంతా అతను సినిమాలు చేసింది కొత్త కొత్త డైరెక్టర్ లతోనే కావడం కూడా ఒక విధంగా ఈ పరిస్థితికి కారణం అని చెప్పాలి. అందుకే సిటీమార్ సినిమా తర్వాత గోపిచంద్ కొన్ని స్క్రిప్ట్ లు తన వద్దకు వచ్చినా కాదనుకుని.... ఫ్యామిలీ డైరెక్టర్ మారుతీ కథను నమ్ముకున్నాడు.

ఇప్పటి వరకు చూసుకుంటే మారుతీ అకౌంట్ లో ప్లాప్ లు ఉన్నా మంచి కథలను తీస్తాడు అన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఈ సినిమా కన్నా ముందు మారుతి తీసిన మంచి రోజులొచ్చాయి మూవీ కూడా నిరాశపరిచింది. అందుకే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం పక్క కమర్షియల్ పై నమ్మకంగా లేరు. తీరా రిలీజ్ అయ్యాక చూస్తే అదే నిజం అయ్యింది. మారుతీ తనపై ఉన్న నమ్మకాన్ని మెల్ల మెల్లగా పోగొట్టుకుంటున్నాడు. కథలను సరిగా డీల్ చేయడంలో విఫలం అవుతుండడమే తన బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం అని ఇండస్ట్రీ లో టాక్ వినబడుతోంది.

మాములుగా మారుతీ సినిమాల్లో కథ మాములుగా ఉన్నా స్క్రీన్ ప్లే మరియు ఎంటర్టైన్మెంట్ తో లాగించేస్తుంటాడు. కానీ ఈ సారి అది వర్క్ అవుట్ కాలేదు. ఆ ఫలితంగా గోపీచంద్ కెరీర్ లో మరో ఓటమి ఎదురయింది. ఇది గోపిచంద్ కు ఏ విధంగానూ కలిసి రాలేదు.
 




మరింత సమాచారం తెలుసుకోండి: