ఎమ్మెస్ రాజు ఒకప్పుడు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈయన బ్యానర్ లోనే సినిమాలలో నటించిన హీరోలు సైతం స్టార్ పొజిషన్లో ఉన్నారు. అలా అని సినిమాలకి ఎమ్మెస్ రాజు నిర్మాతగానే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందించడం జరిగిందట. ఇక ఈయన కెరియర్లో దేవి, మనసంతా నువ్వే, శత్రువు, ఒక్కడు, వర్షం వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లేను అందించారు. ఇలాంటి గొప్ప సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడు గారు కూడా వాన, డర్టీ హరి వంటి సినిమాలను తెరకెక్కించారు.


ఇటీవల తాజాగా తను తెరకెక్కించిన 7 డేస్ 6 నైట్స్ అనే ఒక  యూత్ ఫుల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). నైజాం-11 లక్షలు.
2). సీడెడ్ -6 లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే..7 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..24 లక్షలు రాబట్టింది.
5). రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ విషయానికి వస్తే..7  లక్షలు.
6). ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..31 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది.

7 డేస్ 6 నైట్స్ సినిమా థియేటర్లు బిజినెస్ విషయానికి వస్తే.. రూ.1.2  కొట్లు రూపాయిలు జరగగా ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే.. రూ.1.3 కోట రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం ముగిసే సమయానికి రూ.31 లక్షలను మాత్రమే రాబట్టింది దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు దాదాపుగా రూ.90 లక్షల వరకు నష్టపోయినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ సినిమా ఓటీటి రైట్స్ మాత్రం ఎక్కువ ధరకి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా ఓటీటి రైట్స్  రూ.4.5 కోట రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సినిమా కోటి రూపాయల ఖర్చుతోనే పూర్తి అయినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: