టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, సోనాల్ చౌహాన్మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇది వరకు ఈ సినిమా నుండి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం నాగార్జున కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత ఈ సినిమా నుండి కొన్ని షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి అప్డేట్ లను ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా టీజర్ విడుదల తేదీ ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ది  ఘోస్ట్ మూవీ టీజర్ ను 9 జులై 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో నాగార్జున ఒక కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున నుండి వస్తున్న సినిమా కావడం,  గరుడ వేగ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ది ఘోస్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: