విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ఎఫ్ 3 మే నెల 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రాజేంద్రప్రసాద్ , సునీల్ , మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించగా సోనాల్ చౌహాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. పూజా హెగ్డే నటించిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఎస్ 3 మూవీ విడుదల అయిన మొదటి షో కే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 40 రోజులు పూర్తి అవుతోంది. ఇకపై సినిమాకు కలెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. దానితో ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 18.85 కోట్లు , సీడెడ్ : 6.70 కోట్లు , యూ ఎ : 6.55 కోట్లు , ఈస్ట్ : 3.56 కోట్లు , వెస్ట్ : 2.57 కోట్లు , గుంటూర్ : 3.42 కోట్లు , కృష్ణ : 3.01 కోట్లు ,నెల్లూర్ : 1.85 కోట్లు .
ఎఫ్ 3 మూవీ మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో  46.51 కోట్ల షేర్ , 75.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను సాధించింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  3.15 కోట్లు .
ఓవర్ సీస్ లో : 7.25 కోట్లు .
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ 56.91 కోట్ల షేర్ 95.20 కోట్ల  గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: