టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ ఉన్న సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో మంచి విషయాలను అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ రోజుల్లో మూవీ తో మారుతి దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ రోజుల్లో సినిమా మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా మారుతి కి మంచి క్రేజ్ ను కూడా తీసుకు వచ్చింది. ఆ తర్వాత మారుతి అనేక చిన్న సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. మారుతి కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలలో బలే బలే మగాడివోయ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో నాని హీరోగా నటించగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు నాని వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయి ఉన్నాడు. బలే బలే మగాడివోయ్ సినిమాతో నాని బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

సినిమా 2015 వ ఈ సంవత్సరంలో విడుదల అయ్యి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఈ సినిమా దర్శకుడు మారుతి , హీరో నాని క్రేజ్ మరింత పెరిగింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ... భలే భలే మగాడివోయ్  మూవీ తర్వాత సీక్వెల్ చేయమని చాలా మంది చెప్పారు. అదే అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో ఆ మూవీ సీక్వెల్ పై నేను పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాను అని  మారుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: