టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నితిన్ ప్రస్తుతం ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరిన్ మరియు కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ మూవీ లోని 'రా రా రెడ్డి .. ఐ ఆమ్ రెడీ' అనే  ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను జూలై 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. మాచర్ల నియోజకవర్గం మూవీ చిత్ర బృందం  మొదటగా విడుదల చేయబోయే సాంగ్ ఈ మూవీ లో స్పెషల్ సాంగ్. ఈ స్పెషల్ సాంగ్ లో అంజలి నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా  'రా రా రెడ్డి .. ఐ ఆమ్ రెడీ' సాంగ్ ప్రోమో ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ప్రోమో సాంగ్ లో నితిన్ మరియు అంజలి డాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీరిద్దరూ కలిసి స్పీడ్ మూమెంట్ లో వేసిన డాన్స్ స్టెప్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే అంజలి కూడా తన అందచందాలతో ఈ ప్రోమో సాంగ్ లో అదరగొట్టింది. ఇక ఫుల్ సాంగ్ లో అంజలి ఏ రేంజ్ లో రెచ్చిపోతోంది చూడాలి. మొత్తానికి ఈ ప్రోమో సాంగ్ ని పట్టి చూస్తే ఫుల్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: