దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి ఇప్పుడు ఎంతో క్లిష్ట తరమైన పరిస్థితులలో ఉంది. ఆయనతో పవన్ సినిమా చేస్తాడా లేదా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. చూస్తుండగానే  సంవత్సర కాలం పూర్తయింది. గద్దల కొండ గణేష్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఆ తరువాత తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి ఇంకా సిద్ధం కాకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

హిట్ కొట్టిన తర్వాత  ఏ దర్శకుడు సినిమాను మొదలుపెట్టడానికి పెద్దగా సమయాన్ని తీసుకోడు. కానీ హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే చేసుకోవడమే ఆయనకు శాపంగా మారింది. ఈ చిత్రాన్ని ఎప్పుడో మొదలు పెట్టుకున్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. పవన్ మరోవైపు ఈ సినిమాను పక్కనపెట్టి కొత్తగా ఒప్పుకునే సినిమాలను చేస్తూ చిత్రాల మీద చిత్రాలు చేస్తుంటే హరీష్ శంకర్ సినిమా ను మాత్రం మొదలు పెట్ట లేకుండా ఆలస్యం చేస్తూ పోతున్నాడు. 

మరి పవన్ కళ్యాణ్ తాజాగా ఈ సినిమాను కాదని మరొక సినిమాను కూడా మొదలుపెడుతున్న నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అన్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ రీమేక్ చిత్రం అయిన వినోదాయా సితం అనే సినిమా మొదలు కాబోతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా భవదీయుడు భగత్ సింగ్ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే హరీష్ శంకర్ బాలీవుడ్ లో ఓ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా హరీష్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం నిజంగా అందరిని నిరాశ పరిచే విషయం అనే చెప్పాలి. మరి ఇప్పటికైనా ఈ సినిమా గురించి ఏదోకటి తేల్చుకుని తన కెరీర్ గురించి ఆలోచిస్తే హరీష్ కు మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: