లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలారా బృందం అయిన రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హ్యాపీ బర్త్‌డే. ఈ చిత్రం జిన్‌సిటీ అనే కాల్పనిక ప్రపంచంలో రూపొందినందున పోస్టర్‌లు ఇంకా ట్రైలర్‌లతో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది.వెన్నెల కిషోర్, సత్య ఇంకా నరేష్‌ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. నేడు ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ కథ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే..హ్యాపీ బర్త్‌డే జిండియా అనే కాల్పనిక ప్రపంచంలో ఇది రూపొందించబడింది. జిన్‌సిటీలో రిత్విక్ సోధి అనే రక్షణ మంత్రి ఎవరైనా తుపాకీని కలిగి ఉండవచ్చని తుపాకీ సవరణ బిల్లును ఆయన ఆమోదిస్తాడు. ఇంకా బిల్లు పాస్ అయిన తర్వాత నగరంలో తుపాకీ బజార్‌ను ఉంచారు .అక్కడ ప్రతి ఒక్కరూ కూడా తుపాకీని కొనుగోలు చేస్తారు. తుపాకీలు కూరగాయల మాదిరిగానే అమ్మకం కూడా సాగాయి. ఇంకా అలాగే మరోవైపు రిట్జ్ గ్రాండ్‌లో ఉన్న పబ్‌కి వెళ్లే హ్యాపీ(లావణ్య త్రిపాఠి) అక్కడ నేరస్థులందరూ డబ్బును దోచుకోవాలని నిర్ణయించుకున్నారు, అయితే ఇక ఈ చిట్టడవి నుండి ప్రజలందరూ ఎలా బయటపడతారు అనేది మిగిలిన కథ.


ఇక ఇప్పటి వరకు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన లావణ్య త్రిపాఠి హ్యాపీగా అద్భుతంగా నటించింది. ఇంకా అలాగే ఆమె చాలా ఎనర్జిటిక్‌గా కనిపించింది. ఇక స్క్రీన్‌పై ఆమె ఎక్స్‌ప్రెషన్ చాలా బాగుంది, సత్య మాక్స్ పెయిన్‌గా ఎవ్వరూ నటించలేనంత అద్భుతంగా ఉంది. ఇంకా రిత్విక్ సోధిగా వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే చాలా అద్భుతంగా నటించారు. అలాగే నటీనటులు బాగా చేసారు. ఎవరికి వారు వారికి ఇచ్చిన పాత్రలలో బాగా ఒదిగిపోయారు.ఇక సినిమాలో కామెడీ కొంత వర్కవుట్ అయిన కోర్ ఎమోషన్ అనేది లోపించింది. క్లైమాక్స్ అయితే మరి దారుణంగా ఉంది. ఇది మిమ్నల్ని చాలా బాగా నిరాశపరుస్తుంది. దర్శకుడు కథని సాంకేతికంగా ప్రజెంట్ చేయాలనుకున్నాడు. ఆలోచన మంచిదే అయిన ప్రజంటేషన్ మాత్రం బెడిసి కొట్టింది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చాలా నిరాశజనక చిత్రంగా మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంతో లావణ్య మరో ఫ్లాప్‌ని తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: