టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన మారుతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దర్శకుడు మారుతి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు .

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు మారుతి తాజాగా పక్కా కమర్షియల్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూలై 1 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది . అయితే విడుదలైన మొదటి షో కే పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకోవటంతో ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా ఆశించిన రేంజ్ లో రావడం లేదు. ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి మరి కొన్ని రోజుల్లో ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో పక్కా కమర్షియల్ మూవీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ప్రభాస్ , మారుతి కి అవకాశం ఇస్తాడా ... లేదా ... అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పక్కా కమర్షియల్ మూవీ భారీ విజయం సాధించిన ... సాధించకపోయినా ... ప్రభాస్ మాత్రం మారుతి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు  తెలుస్తుంది. పక్కా కమర్షియల్ రిజల్ట్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ సినిమాపై ఏ మాత్రం లేనట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: