నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండటంతో చిరంజీవికి ఫిలిం మేకింగ్స్ పై విపరీతమైన పట్టు ఉంది. వాస్తవానికి చిరంజీవిని దర్శకత్వం వహించమని ఎంతోమంది ఆఫర్లు ఇచ్చినప్పటికీ అతడు మాత్రం ఆసాహసం చేయడు. దర్శకత్వం వహించే ఓపిక తనకు లేదు అని చిరంజీవి అనేకసార్లు ఓపెన్ గానే చెప్పాడు. అయితే తాను నటించే సినిమాల కథల విషయంలో అదేవిధంగా చరణ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ నటించే సినిమాల కథల విషయంలో కూడా చిరంజీవి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ అనేక మార్పులు చేర్పులు చేస్తాడని ప్రతీతి.


అందువల్లనే చిరంజీవిని ఒక కథ విషయంలో ఒప్పించడం చాలకష్టం అని అంటారు. ఇప్పుడు అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్టేర్ వీరయ్య’ మూవీ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి సలహాతో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు లీకులు వస్తున్నాయి. దర్శకుడు బాబి మొదట్లో చిరంజీవికి చెప్పిన కథకు ఇప్పుడు ఫైనల్ గా తయారైన కథకు చాలతేడాలు ఉన్నాయి అని గాసిప్పుల హడావిడి జరుగుతోంది.


మొదట్లో బాబి ఈమూవీని పూర్తిగా విశాఖపట్నంలోని షిప్ హార్బర్ ప్రాంతంలో అదేవిధంగా వైజాగ్ చుట్టుపక్కలా ఈమూవీని షూట్ చేయాలని దర్శకుడు బాబి ఆలోచనా అని టాక్. అయితే చిరంజీవి మాత్రం ఈమూవీని కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా మలేషియా మాల్టా దేశాలలో కూడ షూట్ చేయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇలా విదేశాలలో షూటింగ్ వల్ల సినిమా బడ్జెట్ పెరిగినప్పటికీ డిఫరెంట్ లోకేషన్స్ లో మూవీ షూట్ చేయడం వల్ల మూవీలో ఫ్రష్ నెస్ కనిపిస్తుందని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. ఇక దర్శకుడు బాబి వ్రాసిన కథకు చిరంజీవి రిపేర్లతో పాటు రచయిత కోన వెంకట్ కూడ ఎంటర్ కావడంతో ఈమూవీ కథలో అనేక మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయితే దర్శకుడు బాబి అనుకున్న కథకు ఇలా మార్పులు జరగడంతో ఈమూవీ మేకింగ్ విషయంలో పట్టు తప్పుతుందా అన్న సందేహాలు కూడ కొండరకు ఉన్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: