టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి కెరియర్ ను మొదలుపెట్ట బోతున్నాడు. 

ఈ సినిమాలో నితిన్ సరసన క్యాథరీన్ థ్రెసా, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా , ఆదిత్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మాచర్ల నియోజకవర్గం చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా అంజలి నటించిన ఒక మాస్ సాంగ్ 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అనే సాంగ్ ను జూలై 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా నిన్న అనగా జూలై 8 వ తేదీన ఈ సాంగ్ ప్రోమో ను చిత్ర బృందం విడుదల చేసింది.

నితిన్,  అంజలి వేసిన స్టెప్ లు ఈ ప్రోమో సాంగ్ కి హైలెట్ గా నిలవగా,  అంజలి అందచందాలు ఈ ప్రోమో సాంగ్ కి మరింత ఆకర్షణను  తీసుకువచ్చాయి. ఇది ఇలా ఉంటే జూలై 9 వ తేదీన శ్రీకాకుళంలో మాస్ జాతర పేరిట ఈవెంట్ లో ఈ మాస్ సాంగ్ ని రిలీజ్ చేయాలని భావించిన యూనిట్, హఠాత్తుగా భారీ గా వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రేక్షకులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలుగకుండా వెన్యూ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: