గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి చిన్న సినిమాల దర్శకుడు అయిన డైరెక్టర్ మారుతిసినిమా చేయబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి కలయికలో భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులు ముందుకు రాబోతుందన్న వార్తలు వస్తున్న కొద్దీ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటిదాకా దీనిపై ఎవరూ కూడా స్పందించకపోవడం అసలు ఈ సినిమా ఉంటుందా లేక ఉండదా అన్న అనుమానాలను కలిగిస్తుంది.

ఇటీవలే మారుతీ రూపొందించిన పక్కా కమర్షియల్ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టని నేపథ్యంలో ఈ సినిమా ఉండదు అని కొంతమంది కథనాలను చెబుతుంటే ఇంకొంతమంది ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ మారుతి సినిమా కథ ఓకే చేశాడని నెట్టింటో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది మారుతీతో ఈ ప్రయోగం చేయడం అవసరమేనని ప్రభాస్ కు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను త్వరగా చేసి విడుదల చేయాలని కూడా కోరుతున్నారు.  తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలు పెట్టడానికి సన్నహాలు చేస్తున్నారట. 

అయితే ఈ సినిమా కథ ప్రకారం రెండు షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారని చెబుతున్నారు. అనుష్క మాళవిక మోహన్ అన్న ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించబోతున్నారు. మిగతా నటీనటులకు సంబంధించిన ఎంపిక త్వరలోనే మొదలు కాబోతుంది. ఇది ఒక హారర్ కామెడీ సినిమా అని ఒక బంగ్లా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఓ ధియేటర్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రం ఈ రాజా డీలక్స్ అని చెబుతున్నారు. ప్రభాస్ తో సినిమా కావడంతో మారుతి తొలిసారి ఎక్కువ మంది రైటర్లతో ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని అంటున్నారు. అందుకోసం ఎక్కువ సమయం కూడా తీసుకుంటున్నాడట మారుతి. మరి ఈ సినిమా ఈ స్థాయిలో తెరకెక్కుతుం అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: