టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కినేని అఖిల్ కెరియర్ లో ఏజెంట్ సినిమా 5 వది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ నటించిన సినిమా కావడం , సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులు ఏజెంట్ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి సాక్షి వైద్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక ప్రధానమైన పాత్రలో కనిపించనుండగా , ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాకపోతే ఇప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటు ఉండడంతో ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ఎడిటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు. టీజర్ సరిగ్గా 1 నిమిషం 15 సెకన్ల పాటు ఉండబోతున్నట్టు,  అఖిల్ మేకోవర్ తో పాటు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ మూవీ టీజర్ హైలైట్ గా నిలువనునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: