యువ హీరో నితిన్ తన కెరియర్ మొదట్లో మాస్ హీరోగా మారేందుకు చాలా అటెంప్ట్ లు చేశాడు. కానీ అవేవి అతనికి మాస్ ఇమేజ్ తీసుకురావడంలో సహకరించలేదు. తనని కేవలం ఆడియెన్స్ లవర్ బోయ్ గానే చూడాలని అనుకుంటారు అన్న విషయం చాలా ఫ్లాపుల తర్వాత తెలుసుకున్నాడు నితిన్. అందుకే మాస్ మూవీస్ జోలికి వెళ్లకుండా నితిన్ తన మార్క్ కామెడీ, లవ్ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ వచ్చాడు. అయితే లేటెస్ట్ గా మరోసారి మాస్ అటెంప్ట్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సొంత బ్యానర్ లో సినిమా ప్రయత్నం చేస్తున్న నితిన్. ఈ సినిమాలో మాస్ లుక్ తో అదరగొడుతున్నారు. సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన రా రెడ్డి సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది. అంజలి ఈ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనున్నాయి.

రా రెడ్డి మూవీలో నితిన్ మాస్ లుక్ ఆకట్టుకుంది. ఇప్పటివరకు నితిన్ మాస్ మూవీస్ చేసినా ఈ సినిమాలో లుక్ చాలా కొత్తగా ఉంది. నిజంగానే నితిన్ ఈ సినిమాతో మాస్ హీరోగా మెప్పిస్తాడని అనిపిస్తుంది. సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో నితిన్, కృతి శెట్టిల జోడీ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెస్తుందని అంటున్నారు. మరి నితిన్ చేస్తున్న ఈ మాస్ అటెంప్ట్ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మాచర్ల నియోజక వర్గం మూవీ తర్వాత నితిన్ వక్కంతం వంశీ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా వాస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: