2022 దసరాకి పెద్ద సినిమాల రిలీజ్ హంగామా ఉండబోతుంది. ఇప్పటికే ఈ దసరాకి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాని దసా బరిలో దించుతున్నారు.

ఇక ఈ సినిమాతో పోటీగా కింగ్ నాగార్జున ఘోస్ట్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున హీరోగా వస్తున్న ఘోస్ట్ సినిమాలో సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకులను మెప్పించింది. నాగార్జున నుంచి వస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీగా ది ఘోస్ట్ మూవీ రాబోతుంది. ఈ సినిమా కూడా దసరా కి రిలీజ్ ఫిక్స్ చేశారు.

చిరంజీవి తో పోటీగా నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీఎజ్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర చిరు, నాగ్ ఒకేసారి పోటీ పడుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటేస్తారో చూడలి. చిరు గాడ్ ఫాదర్ మూవీ టీజర్ ఈమధ్య ప్రేక్షకుల ముందుకు రాగా అందులో మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చిరుతో పాటుగా నాగ్ కూడా బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమయ్యాడు. నాగార్జున కూడా ది ఘోస్ట్ మూవీ పై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. బంగార్రాజు తర్వాత నాగ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలే కాదు చిరు, నాగ్ లతో పాటుగా మరో రెండు సినిమాలు కూడా దసరాకి వస్తాయని తెలుస్తుంది. నాని నటిస్తున్న దసరా మూవీ కూడా దసరా టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరితో పాటు నాని కూడా పోటీకి వస్తాడా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: