దాదాపుగా 40 సంవత్సరాల నుండి అన్ని భాషల లో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో కమలహాసన్ ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈయన నటన విషయంలో విలక్షణమైన నటనతో విభిన్నమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే గడిచిన ఎన్నో సంవత్సరాల క్రితం నుండి విజయాన్ని అందుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు కమలహాసన్ ఇలాంటి సమయంలో విక్రమ్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మరొకసారి తన స్టామినా ఏంటో చూపించాడు కమలహాసన్.


ఈ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ , కార్తీ సూర్య కీలకమైన పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.7 కోట్ల రూపాయలకు హీరో నితిన్ హక్కులను కొనుగోలు చేశారు. హీరో నితిన్ కు ఎన్ని కోట్లు లాభం వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). నైజాం-7.26 కోట్ల రూపాయలు.
2). సి డెడ్ -2.33 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.52 కోట్ల రూపాయల.
4). ఈస్ట్ గోదావరి-1.29 కోట్లు రూపాయలు
5). వెస్ట్ గోదావరి -84 లక్షలు
6). గుంటూరు -1.20 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.45 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-61 లక్షలు.
9). మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల లో దాదాపుగా రూ.17.50 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక షేర్ పరంగా రూ.30.70 కోట్ల గ్రాస్ దక్కించుకున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.204 కోట్ల రూపాయల చేరుతో పాటు రూ.410.90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని నితిన్ రూ.7.50 కోట్లకు తీసుకోగా ఈ చిత్రం దాదాపుగా ఇప్పుడు 10 కోట్ల రూపాయలను లాభాన్ని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: