అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది.

అందుకే స్టార్ సినిమాల మ్యూజిక్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అఖిల్ ఏజెంట్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకటి ఉండబోతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాల్లో ఐటం సాంగ్ అనేది కంపల్సరీ. అఖిల్ ఏజెంట్ సినిమాలో రాబోతున్న స్పెషల్ సాంగ్ లో జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా నటిస్తుందని తెలుస్తుంది. జాతిరత్నాలు సినిమాతో ఆమె పాపులర్ కాగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

ఇక ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ లో ఫరియా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని అంటున్నారు. స్పెషల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరన్స్ ఇచ్చిన ఫరియా అఖిల్ ఏజెంట్ లో వన్ ఆఫ్ ది హైలెట్ సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుందని చిత్రయూనిట్ గట్టి నమ్మకంగా ఉంది. సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలు త్వరలో రిలీజ్ చేయనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సత్తా చాటిన అఖిల్ ఏజెంట్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఫరియా అద్భుల్లా కూడా కెరియర్ లో వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ తన సత్తా చాటుతుంది. అఖిల్ ఏజెంట్ మూవీ కూడా అమ్మడి కెరియర్ కు ఎంతోకొంత హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: