టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినా అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

మూవీ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా , ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొంత కాలం  షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా కొనసాగుతోంది. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండడంతో ఆగస్ట్ 12 వ తేదీన ఈ సినిమా విడుదల కావడం కష్టం లాగానే కనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏజెంట్ మూవీ కి సంబంధించి చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ను జులై 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర బంధం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ను విడుదల చేయడంతో అక్కినేని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , హిప్ హప్ తమిజా ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: