ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మరీనా యువ నటుడు కిరణ్ సబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో హీరోగా అడుగుపెట్టాడు. తాను కెరీర్ లో తీసిన తొలి సినిమా తోనే... అందరినీ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం మాత్రం నిరాశను మిగిల్చింది అని చెప్పాలి. ఆ తర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం తో వచ్చి హిట్ కొట్టాడు. దీనితో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా సినిమా అవకాశాలు తనకు చుట్టుముట్టాయి. అయితే కుర్రాడు మాత్రం సరైన కథలను ఎంచుకోలేక హిట్ ను కొట్టలేక ఆపసోపాలు పడుతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు డుమ్మా కొట్టాయి.

ఇప్పుడు ఇతని ఖాతాలో మరో రెండు సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ఒకటి "నేను మీకు బాగా కావలసిన వాడిని"... ఈ సినిమా ద్వారా మరో కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఒక కార్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. కిరణ్ సరసన సంజనా ఆనంద్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నిన్న రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఎప్పటిలాగే టీజర్ లో యూత్ ను ఆకట్టుకునే డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు, మరి సినిమాలో అసలు విషయం ఉంటుందా ? లేదా పాత సినిమాల లాగే ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.

ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కిరణ్ కు మామయ్యగా నటించనున్నాడు. ఇందులో తన పాత్ర హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవడం తనకు చాలా ముఖ్యం అని చెప్పాలి. లేదంటే చాల మందిలాగే ఇతను కూడా కనుమరుగైపోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: