నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమా రూపొందుతుంది. రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కు తు ఉండగా త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమాలోని ఓ మాస్ పాటను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది ఇందులో అంజలి స్పెషల్ అపీరియన్స్ ఇవ్వగా ప్రేక్షకులను నితిన్ అభిమానులను ఈ పాట ఎంతగా నో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. గత రెండు మూడు సినిమాలు గా నితిన్ ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరుస్తున్నాడు. దాంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశాడు. మరి సక్సెస్ తప్పకుండా అవసరం అయిన నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా నితిన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. 

అయితే మాస్ ఎలివేషన్ ఉన్న చిత్రం కావడంతో ఈ సినిమాలో నితిన్ ఏ విధంగా కనిపించబోతాడు అన్న ఆసక్తి అందరిలో ఉంది. గతంలో ఆయన మాస్ ప్రేక్షకు లను ఆకట్టుకోవాలని సినిమాలు చేసే ప్రయత్నంలో ఎన్నో దెబ్బలు చవి చూశాడు మరి చాలా రోజుల తర్వాత ఆయన చేస్తున్న ఈ మాస్ మసాలా సినిమా ఏ విధంగా ప్రేక్షకు లను ఆకట్టుకుంటుందో చూడాలి. గత కొన్ని సినిమాలుగా ఆయన ప్రేమకథ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆ ప్రయత్నాలలో భంగపడ్డ నితిన్ ఇప్పుడు ఈ సినిమా ను ఈ మాస్ పరమైన సినిమాలను చేయడానికి ముందుకు వస్తున్నాడు. మరి ఆయనకు ఇవి ఏరకంగా కలిసి వస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: