టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హరీష్ శంకర్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన షాక్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన హరీష్ శంకర్ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ తో తెరకెక్కించిన మిరపకాయ్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు .

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో చేరిపోయాడు. ఇది ఇలా ఉంటే ఆఖరిగా హరీష్ శంకర్ , వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దల కొండ గణేష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మరి కొన్ని రోజులు హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హరీశ్ శంకర్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ...  త్వరలోనే రామ్ తో  సినిమా చేస్తున్నాను అని ప్రకటించాడు. మరి రామ్ తో హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ కంటే ముందు సినిమా చేస్తాడా ... తర్వాత చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: