బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా వరుస అపజయాలు బాక్సాఫీస్ దగ్గర పలకరించడంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా ప్రస్తుతం షారుక్ ఖాన్ తమిళ యువ దర్శకుడు అయిన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. జవాన్ మూవీ లో షారుక్ ఖాన్ పాత్ర తో పాటు మరో అదిరిపోయే ముఖ్యమైన పాత్ర కూడా ఉండునట్లు ,  ఆ పాత్ర ను తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయిన తలపతి విజయ్ చేయనున్నట్లు, అలాగే ఆ పాత్ర జవాన్ మూవీ లో 10 నిమిషాల పాటు ఉండనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ , దర్శకుడు అట్లీ కి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తేరి , మెర్సిల్ , బిగిల్ మూవీ లు తెరకెక్కాయి. ఈ మూవీ లు అన్ని కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే అట్లీ తో ఉన్న స్నేహం కారణంగా తలపతి విజయ్  'జవాన్' మూవీ లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: