అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వరుస ప్లాప్ సినిమాలతో సతమతమైన నాగార్జున తనయుడు అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్  అనే సినిమాతో మాత్రం హిట్ కొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇదే జోష్ లో ప్రస్తుతం భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు అక్కినేని అఖిల్. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది.


 ఈ సినిమా కోసం ఏకంగా బాడీ పెంచి బీస్ట్ లా తయారయ్యాడు అఖిల్. దీంతో ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఈ సినిమా గురించి అప్డేట్ ఏం బయటికి వస్తుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.  ఇలాంటి సమయంలో అఖిల్ కొత్త సినిమా గురించి కూడా ఒక అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండబోతుందట.


 అయితే అఖిల్ తో సినిమా చేయాలని అటు దిల్రాజు ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇన్నాళ్ళకి ఈ కాంబినేషన్ కుదిరింది అని తెలుస్తుంది. అయితే అఖిల్ నటించ బోయే సినిమాకు తమ్ముడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.  తమ్ముడు అనే టైటిల్ వినిపించ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ తమ్ముడు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఇక ఇప్పుడు ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అఖిల్ సిద్ధమవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: