ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటే, మరి కొన్ని సినిమాలపై ప్రేక్షకులు అంతగా అంచనాలు పెట్టుకోరు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ...  కొన్ని సినిమాల్లో స్టార్ హీరోలు నటించడం వల్ల లేదా స్టార్ దర్శకులు మూవీకి దర్శకత్వం వహించడం వల్ల కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడితే,  కొన్ని సినిమాల్లో భారీ తారాగణం లేనప్పటికీ మూవీ నుండి మేకర్స్  విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం  అలాగే ప్రమోషన్ లను కూడా డిఫరెంట్ గా ట్రై చేయడం ఇలా కొన్ని కారణాల వల్ల చిన్న సినిమాలపై కూడా కొన్ని సందర్భాల్లో భారీ అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి.

ఇలా ఈ మధ్యకాలంలో చిన్న సినిమా అయిన ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన సినిమా హ్యాపీ బర్త్ డే. ఈ సినిమాలో లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో నటించగా వెన్నెల కిషోర్, సత్య, నరేష్ అగస్త్య, సుదర్శన్, గెటప్ శీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి రితీశ్ రానా దర్శకత్వం వహించాడు. ఇలా ఈ సినిమాలో స్టార్ నటీనటులు లేకపోయినప్పటికీ, స్టార్ దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించక పోయినప్పటికీ ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిఫరెంట్ గా ఉండడం, అలాగే ప్రచారాలను కూడా ఈ చిత్ర బృందం సరికొత్త రీతిలో చేయడం ద్వారా ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్లను అందుకోలేక పోతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: