విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడంతో ఎఫ్ 3 మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఎఫ్ 3 మూవీ విడుదలైన మొదటి రోజు మొదటి షో కె పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకుంది. మొదటి వారం రోజుల పాటు మంచి కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసిన ఎఫ్ 3 మూవీ కి ఆ తర్వాత వారం నుండి మేజర్ , విక్రమ్ మూవీ లో నుండి గట్టి పోటీ ఎదురవడంతో ఎఫ్ 3 మూవీ కి రెండవ వారం నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త కలెక్షన్ లు తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ ఓవరాల్ గా ఎఫ్ 3 మూవీ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని మంచి డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఎఫ్ 3 మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది. అందుకు సంబంధించిన తాజా ప్రకటన  కూడా బయటకు వచ్చింది. ఎఫ్ 3 మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో జూలై 22 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: