టాలీవుడ్ ఇండస్ట్రీ లో కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దర్శకుడు అనిల్ రావిపూడి 'పటాస్' మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. పటాస్ మూవీ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు . 

పటాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో దర్శకుడిగా అనిల్ రావిపూడి కి , హీరోగా కళ్యాణ్ రామ్ కి ఇద్దరికీ కూడా ఈ మూవీ ద్వారా ఫుల్ క్రేజ్ లభించింది . ఈ ఇద్దరి కెరీర్ లో కూడా పటాస్ మూవీ చెప్పుకోదగ్గ మూవీ గా నిలిచి పోయింది . ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పటాస్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది అని గతంలో వార్తలు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే . కాక పోతే అనేక కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేదు . కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొంత కాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబో తున్నట్లు తెలుస్తోంది .

మరి కొన్ని రోజుల్లో అనిల్ రావిపూడి , బాల కృష్ణ హీరో గా  తెరకెక్క  బోయే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు . అలాగే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కూడా కొన్ని సినిమా ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టుకొని రెడీ గా ఉన్నాడు . వీరిద్దరూ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాక వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: