నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . అలా అఖండ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

సినిమా పూర్తి కాగానే బాల కృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు . ఇన్ని రోజుల పాటు ఎఫ్ 3 మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా పనులు అన్ని ముగియడంతో ప్రస్తుతం బాలకృష్ణ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఒక అదిరిపోయే బస్ యాక్షన్ సన్నివేశం ఉండబోతుందట , ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కి హైలెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది . 

అలాగే ఈ యాక్షన్ సన్నివేశాన్ని మూవీ కే హైలెట్ గా చిత్రీకరించడం కోసం చిత్ర బృందం పలు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ 50 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపించబోతున్నట్లు , ఈ మూవీ లో బాలకృష్ణ కు ఒక కూతురు కూడా ఉండనునట్లు ,  ఆ కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: