తెలుగు సినీ ఇండస్ట్రీలో బాబు మోహన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన నటనతో,  కామెడీ టైమింగ్ తో  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కలిసి పండించే కామెడీ ఎంత గొప్పగా ఉంటుంది అంటే వీరి కాంబినేషన్ కి  మరింత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ఇక బాబు మోహన్ కొన్ని వందల చిత్రాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా విలన్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ రంగంలో అడుగులు వేసిన అక్కడ సక్సెస్ పొంది ఉన్నత పదవిని చేపట్టారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన బాబు మోహన్ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలు చెబుతూనే సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించారు. ఒకానొక సమయంలో సౌందర్య తనతో ఒక పాటలో స్టెప్పులు వేసిన విషయం తెలిసింది ఇక అలా ఈ షూటింగ్ జరగకముందు సౌందర్య తో చాలామంది బాబు మోహన్ పక్కన స్టెప్పులు వేస్తే మీ కెరియర్ నాశనం అవుతుంది అంటే హెచ్చరించారట . కానీ ఆమె మాత్రం బాబు మోహన్ తో నటించడం నా అదృష్టమని తెలిపిందట. అంతేకాదు కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం ఇద్దరు కూడా బాబు మోహన్ సినిమాలలో నటిస్తే ఆ సినిమాలో మేము నటించమని కూడా చెప్పారట .

కానీ ఈ వివాదంలోకి రాజేంద్రప్రసాద్,  దాసరి నారాయణరావు కల్పించుకొని ముగ్గురికి సర్ది చెప్పడం జరిగింది. ఇక తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక ఇలా ఎన్నో ఇబ్బందులను సినీ కెరియర్లో ఎదుర్కొన్నాను అని బాబు మోహన్ మీడియాతో వెల్లడించారు. ఇకపోతే ప్రజలకు కష్టం వస్తే ఆదుకుంటూనే తన వంతు సహాయం చేస్తూ మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు బాబు మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: