పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు సెట్స్ మీద పలు సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే సినిమాతో ఆ విజయాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నా డు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఏ సినిమా ఆయన తదుపరి సినిమా గా విడుదలవుతుందన్న క్లారిటీ మాత్రం ఇప్పుడు లేదనే చెప్పాలి. కొత్త సినిమాలను ఒప్పుకోవడంలో చూపిస్తున్న జోరు ను పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో చూపించడం లేదు.

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ఆయన తదుపరి సినిమాగా రావలసి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగాన్ని షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఇతర చిత్రాల చిత్రీకరణకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్ట లేకపోయాడు.  కారణం ఏదైనా కూడా ఇంతటి భారీ బడ్జెట్ సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం నిర్మాతలకు ఎంతో భారాన్ని పెంచుతుంది అని చెప్పవచ్చు. ఇంకొకవైపు దర్శకుడు క్రిష్ కూడా ఈ చిత్రం చేయడానికి ఇన్ని సంవత్సరాలు కాచుకొని చూస్తూ ఉన్నాడు. 

ఈ దర్శకుడి తో పాటు మరొక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నాడు. వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ చిత్రం అనౌన్స్ అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ అయ్యి చాలా నెలలే గడుస్తున్నా కూడా ఇంకా అది మొదలు పెట్టకపోవడంతో హరీష్ శంకర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల షూటింగ్ లు చేయడానికి డేట్లు దొరుకుతున్నాయి కానీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి ఎందుకు వేచి చూస్తున్నాడు అన్న ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికి కూడా కొత్తగా ఒప్పుకున్న ఓ తమిళ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: