అంతకుముందు సీరియల్స్, యూట్యూబ్ సీరీస్ లతో క్రేజ్ తెచ్చుకున్న సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ 5తో మరింత పాపులర్ అయ్యింది. తన చలాకీ తనం.. తన దూకుడుతో దాదాపు ఫైనల్ వీక్ వరకు వచ్చింది సిరి. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి షణ్ముఖ్ ల రచ్చ అందరికి తెలిసిందే. బయట సిరికి శ్రీహాన్.. షణ్ముఖ్ కి దీప్తి సునైనా లవర్స్ గా ఉన్నా.. హౌజ్ లో సిరి, షణ్ముఖ్ లు బాగా దగ్గరవడం ఆడియెన్స్ ని అప్సెట్ చేసింది. హౌజ్ లో జరిగిన ఇష్యూ వల్లే బయటకు వచ్చాక షణ్ముఖ్, దీప్తిలు దూరమయ్యారు. ఆఫ్టర్ బిగ్ బాస్ వారి క్రేజ్ తో వరుస షోలు, వెబ్ సీరీస్ లు చేస్తున్నారు.

సిరి కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. అయితే సిరి హౌజ్ లో ఎంత అతి చేసినా సరే ఆమెని రిసీవ్ చేసుకున్నాడు శ్రీహాన్. అసలైతే షణ్ముఖ్ తో ఆమె ఉన్న క్లోజ్ నెస్ కి మరెవరైనా అయితే సిరికి బ్రేకప్ చెప్పేస్తారు. కానీ శ్రీహాన్ సిరిని అంతకుమించి ప్రేమించాడు కాబట్టే ఆమె కి దగ్గరయ్యాడు. ఇక లేటెస్ట్ గా సిరి ఓ కొత్త కారు కొన్నది. ఎం.జి హెక్టార్ కారుని తన సొంతం చేసుకుంది సిరి. తన లవర్ శ్రీహాన్ తో కలిసి ఆ కారుని డెలివరీ తీసుకుంది సిరి.

సిరి కారు కొనడంతో కారు కొనడం కాదు ముందు డ్రైవింగ్ నేర్చుకో అని కామెంట్ పెట్టాడు శ్రీహాన్. ఎలాగు డ్రైవింగ్ కి శ్రీహాన్ ఉంటాడనే నమ్మకంతోనే సిరి కూడా ఆ కారు కొని ఉండొచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ కి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ లో సిరి ఉన్నప్పుడు సిరి లవర్ గా శ్రీహాన్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 6లో అతను వస్తే తప్పకుండా అతనే విన్నర్ అవుతాడని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సిరి, శ్రీహాన్ ల జోడీ ఆడియెన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: