నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ కామెడీ దర్శకులలో ఒకరు ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి అనేక అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు . అలాగే బాలకృష్ణ తో తెరకెక్కించబోయే మూవీ తన క్రితం మూవీ లాలగా కామెడీ ఎంటర్టైనర్ గా ఉండదు అని , బాలకృష్ణ మూవీ లాలగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని కూడా తెలియజేశాడు .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ 30 ఏళ్ళ వయస్సు లో ఒక హత్య చేసి జైల్లో 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి ల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ లో బాలకృష్ణ కు ఒక కూతురు ఉండబోతున్నట్లు , ఆ కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోం ది. ఈ మూవీ ని దర్శకుడు అనిల్ రావిపూడి దసరా కు మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం . దసరాకు ఈ మూవీ ని మొదలు పెట్టి చక చక షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని అనిల్ రావిపూడి పిక్స్ అయినట్లు తెలుస్తుంది .

ఇలా అనిల్ రావిపూడి , బాలకృష్ణ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్నట్లు సమాచారం . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: