గతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో పదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..కాగా అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపుగా రెండేళ్లు అవుతుంది.. పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల వాయిదా పడుతూ పోతుంది..ఇదిలావుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు..కాగా ఈ సినిమా తో పాటుగా తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదయ్యా సీతం సినిమాని రీమేక్ చెయ్యబోతున్నాడు..పోతే ఈ రెండు సినిమా పూర్తి అవ్వడానికి చాలా సమయమే పడుతుంది..

ఇక దానికి తోడు ఈ ఏడాది దసరా నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా గడపబోతున్నాడు..కాగా సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 20 నెలలు ఉండడం తో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 వ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించబోతున్నారు..ఇక దీనితో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు.ఇకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది..ఇక అదేమిటి అంటే నిన్న మొన్నటి వరుకు పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన హరీష్ శంకర్..అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచనలు పక్కన పెట్టినట్టు తెలుస్తుంది..ఇకపోతేపవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశం మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..కాగా 'నా కోసం సమయం వృధా చేసుకోకు..

పోతే మన సినిమా ప్రారంభం అవ్వడానికి ఇంకా కాస్త సమయం పట్టొచ్చు..ఇక ఈలోపు నువ్వు వేరే హీరో తో సినిమా చెయ్యాలనుకుంటే చేసుకొనిరా' అని చెప్పాడట..అయితే దీనితో హరీష్ శంకర్ హీరో రామ్ కోసం ఎప్పటి నుండో సిద్ధం చేసుకున్న కథని తెరకెక్కించడానికి సిద్ధం అయినట్టు సమాచారం..తాజాగా జరిగిన రామ్ 'ది వారియర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ 'రామ్ తో గతం లో నేను సినిమా చెయ్యాల్సింది..ఇదిలావుంటే తనకి ఉన్న కమిట్మెంట్స్ మరియు నాకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల చేయలేకపోయాము..ఇక త్వరలోనే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది' అంటూ చెప్పుకొచ్చాడు..అయితే ఇక  ఎప్పటి నుండో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న 'భవదీయుడు భగత్ సింగ్ ' సినిమా ప్రారంభం కి ఇంకా కొన్నాళ్ళు వేచి చూడక తప్పేటట్టు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: