అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఇప్పుడు తెలుగు సినిమాల లో నిలదొక్కుకోవడానికి శతవిధాలు గా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆమెకు ఇప్పుడు చేస్తున్న ఏ సినిమాలు కూడా కలిసి రాకపోవడంతో అంతకంతకు ఆమె క్రేజ్ తగ్గిపోతూ ఉంది అని చెప్పాలి. లావణ్య త్రిపాఠి మంచి నటే అందులో ఇలాంటి సందేహం లేదు. అందం పరంగా అభినయం పరంగా ప్రేక్షకులను అలరించే సత్తా ఆమెకు బాగానే ఉంది. అయితే టాలెంట్ కు కొదవ లేకపోయినా కూడా అదృష్టం వెక్కిరించడంతో ఇప్పుడు సినిమాల ద్వారా ఆమె పెద్దగా అలరించలేకపోతుంది. 

పెద్ద హీరోలతో సినిమాల అవకాశాలు వచ్చినా కూడా వాటి ద్వారా నిరూపించుకున్న కూడా ఆమెకు తదుపరి సినిమా అవకాశలు వచ్చి నా కూడా అవి ప్లాప్ అవుతూ ఉండడం వంటివి ఆమెను మరింత కిందకు దిగ జార్చింది. ఆ విధంగా ఆమె ఇప్పుడు చేసిన హ్యాపీ బర్త్ డే సినిమా విడుదలయ్యి థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఈ సినిమా రాంగ్ టైమ్ లో విడుదల అయింది అని చెప్పాలి. 

అంతకుముందు ఈ ముద్దుగుమ్మ పెద్ద సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా సినిమాల లో చేసేది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంది ఆ విధంగా వచ్చిన హ్యాపీ బర్త్ డే సినిమా క్రేజీ చిత్రంగా విడుదలైన కూడా వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడం చిత్రానికి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి.  ఆ విధంగా ఈ సినిమా విడుదలై మంచి పేరు సంపాదించుకున్న కూడా లావణ్య త్రిపాటికి అది ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నిలదుకుపోవాలంటే మరొక మంచి సినిమా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: