అక్కినేని అఖిల్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి. అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా కి ఇంతటి మంచి అంచనాలు ఏర్పడడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయన తొలి విజయం అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

తొలి మూడు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. నాలుగో సినిమా అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ద్వారా ప్రేక్షకులు పెద్దగా ఎంజాయ్ చేయలేదనే చెప్పాలి. అఖిల్ కి కూడా కావాల్సిన విజయం ఎక్కువ మొత్తం లో దక్కలేదు. అక్కినేని అభిమానుల విజయపు ఆకలి మాత్రం అస్సలే తీరలేదు ఈ సినిమా తో. అందుకే మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఏజెంట్ సినిమా పైనే అందరి చూపు ఉంది. ప్రచార చిత్రాలతోనే ఈ సినిమా యొక్క క్రేజ్ ను అమాంతం పెంచేసాడు. సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన ఈ హీరో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అలా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పరచగలిగాడు.

ఇకపోతే ఈ సినిమా పై ఇప్పటివరకు ఉన్న బజ్ కాస్త ఇప్పుడు టీజర్ అనౌన్స్ మెంట్ తో ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పాలి. ఈ సినిమా యొక్క టీజర్ రేపు విడుదల కాబోతుంది. ప్రేక్షకులను భారీగా ఊరిస్తున్న ఈ సినిమా ఏ స్థాయి లో ఉంటుందో కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమా పై మంచి ఆసక్తి ని కనపరుస్తున్నారు. తప్పకుండ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆశలని ఈ చిత్రం నిలబడుతుందా అనేది చూడాలి. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: