మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా లాల్ సింగ్ చద్ద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా ,  ఒక కీలకమైన పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా ఈ మూవీ లో నటించాడు . 

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది . ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ మూవీ కి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మ‌రియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా లాల్ సింగ్ చద్ద మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ,  మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున  మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని కొంత మంది అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన లాల్ సింగ్ చద్ద మూవీ ని ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో నిర్వహించారు. ఈ మూవీ ప్రివ్యూ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగినట్లు తెలుస్తోంది.

లాల్ సింగ్ చద్ద మూవీ ప్రివ్యూ లో మెగాస్టార్ చిరంజీవి,  నాగార్జున , అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్  లతో పాటు అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లాల్ సింగ్ చద్ద మూవీ తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: