టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ ప్రస్తుతం రాజకీయ నేపథ్యం గా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తుండగా,  ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 

అలాగే ఈ మూవీ లోని ఒక స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ అంజలి కూడా కనిపించబోతోంది. ఇప్పటికే అంజలి నటించిన సాంగ్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం అంజలిమూవీ లో నటించిన సాంగ్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను కూడా కాస్త పెంచింది. అందులో భాగంగా తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్న సముద్ర కని కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.  

సముద్ర కని 'మాచర్ల నియోజకవర్గం' మూవీ లో రాజప్ప అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన సముద్ర కని కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉంది. శ్రేష్ట్ మూవీస్ వారు ఈ మూవీ ని నిర్మిస్తుండగా , మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.  మరి నితిన్ ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: