ఇక ప్రేక్షకులని థియేటర్లకు లాక్కొచ్చేదే టైటిల్. మంచి టైటిల్ కనుక ఉంటే ఖచ్చితంగా సినిమా సగం విజయం దక్కినట్టే అని ఫ్యాన్స్ భావిస్తారు. కొన్ని సినిమాల ద్వారా అది రుజువు అయ్యింది.అందుకే ఇక హీరోలు దర్శకనిర్మాతలు సినిమాల టైటిల్ విషయంలో ఎంతగానో ఆచితూచి ఎంపిక చేస్తారు.ఇక మెగా కాంపౌండ్ అయినా నందమూరి కాంపౌండ్ ఇంకా అక్కినేని కాంపౌండ్ లేదా దగ్గుబాటి కాంపౌండ్ ఇలా ఎవరైనా కానీ టైటిల్ విషయంలో ఏమాత్రం రాజీకి రాకుండా  ఎంత లేట్ అయినా మంచి టైటిల్ ఎంపిక కోసం వేచి చూస్తారు.ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నటసింహా నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడితో తన సినిమాకి మంచి టైటిల్ కోసం వేచి చూస్తున్నారు. కానీ అసలు కుదరడం ఏదు. యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఈ క్రేజీ మూవీ టైటిల్ కోసం చాలానే తపిస్తున్నారు.ఇంతకుముందు అయితే `రామారావు గారు!` అనే టైటిల్ ని అనిల్ రావిపూడి సూచిస్తే అదే టైటిల్ తో రవితేజ సినిమా చేస్తున్నందున ఇక దాన్ని వద్దనుకున్నారట.


ఇక ఆ తర్వాత `బ్రో! ఐ డోంట్ కేర్` అనే టైటిల్ ని కూడా సూచించగా.. బాలయ్య బాబుకు ఇది నచ్చలేదట. మరో టైటిల్ ని వెతకమని కూడా దర్శకుడికి సూచించినట్టు సమాచారం తెలుస్తోంది.అలాగే వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న గోపిచంద్ మలినేనితో కెరీర్ 107వ సినిమా చేస్తున్న బాలకృష్ణ తదుపరి అనీల్ రావిపూడితో ఎన్.బి.కె 108 మూవీ కూడా చేయనున్నారు. ప్రస్తుతం టైటిల్ డైలమా అనేది ఇప్పుడు కొనసాగుతోంది. అనిల్ రావిపూడి ఏదో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంటుంది.ఇక వరుస ప్లాపుల మీద వున్న బాలయ్య ఇటీవల ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ సినిమా తీసి మంచి హ్యాట్రిక్ కం బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆఫ్టర్ పాండమిక్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: