తాజాగా నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం.ఇక  శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.ఇదిలావుంటే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే రారా రెడ్డి అంటూ సాగే ఈ పాటకు నితిన్ తో పాటు నటి అంజలి మాస్ స్టెప్పులు వేసి డాన్స్ ఇరగ దీసారు.పోతే  ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో ట్రెండ్ అవుతుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి ఈ పాటకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిజానికి ఈ సినిమాలో నితిన్ తన మొదటి సినిమా జయం సినిమాలోని రాను రాను అంటుంది చిన్నదో అనే పాటను పూర్తిగా రీమిక్స్ చేసి పెట్టాలని భావించారట. ఇక ఈ పాట రీమిక్స్ లో నటించడం కోసం నితిన్ సదాను సంప్రదించగా ఈ పాట చేయడానికి సదా ఒప్పుకోలేదని తెలుస్తోంది.అయితే ఈ విధంగా సదా ఈ పాట రీమిక్స్ చేయడానికి నితిన్ కు హ్యాండ్ ఇవ్వడంతో నితిన్ చివరి క్షణంలో రారా రెడ్డి అనే పాటను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.ఇదిలావుంటే  ఈ సినిమాలో రాను రాను అంటుంది సినిమా రీమిక్స్ సాంగ్ చేయలేకపోవడంతో రారా రెడ్డి అనే సాంగ్ చివర్లో 'జయం' చిత్రంలోని 'రాను రానంటూనే చిన్నదో అనే పాట పెట్టారు.

అయితే  ఇక ఈ పాట సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.పోతే మాచర్ల నియోజకవర్గం సినిమాలో రాను రాను అంటుందో చిన్నదో అనే పాటను రీమిక్స్ కనుక చేసి అందులో సదా నితిన్ కనుక నటించి ఉంటే ఈ పాట మరో లెవల్ కి వెళ్ళేది ఈ పాటను రిజెక్ట్ చేసి సదా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందని చెప్పాలి.ఇకపోతే ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి సదాకు ఈ పాట మంచి బూస్ట్ ఇచ్చేదని, మంచి గోల్డెన్ ఛాన్స్ సదా మిస్ చేసుకుందని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: