దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి రమ్య కృష్ణ. హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా కెరియర్ ప్రారంభం లోనే నీలాంబరి లాంటి వైవిధ్య భరిత పాత్రలు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ శివగామిగా బాహుబలితో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఇపుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అందం , అభినయం తో పాటు పవర్ ని కూడా కనబరిచిన నటి రమ్య కృష్ణ. ఇండస్ట్రీలో పవర్ఫుల్ పాత్రలకు బెస్ట్ చాయిస్ గా నిలిచారు రమ్య కృష్ణ. కొన్ని పాత్రలకు రమ్య కృష్ణ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని ఆమె డేట్స్ దొరికే వరకు వెయిట్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు.

అయితే రమ్య కృష్ణ  ఒక రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును ఆమె ఒక రోజుకి 10 లక్ష ల వరకు ఛార్జ్ చేస్తారట, పాత్రను బట్టి కొన్ని సార్లు ఇంతకు మించే తీసుకుంటారట. అంటే ఓ సినిమా కోసం 10,15 రోజులు చేస్తే చాలు పారితోషకం కోట్లల్లో ఉంటుంది. ఇప్పటి కొందరు యంగ్ స్టార్ హీరోయిన్లు ఒక సినిమా మొత్తం చేసిన ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు అంటే రమ్య కృష్ణకు ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె ఎంత బిజీబిజీగా ఉన్నారు అన్నది తెలిసిందే.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ లో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా వరుస బిగ్ ప్రాజెక్టు లు చేస్తూ చాలా చాలా బిజీగా ఉంటున్నారు నటి రమ్య కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: