విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. 

మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ లో రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ , సునీల్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా , పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో నటించింది. పూజా హెగ్డే నటించిన ఐటమ్ సాంగ్ సినిమా విజయానికి సహాయ పడింది. ఎఫ్ 2  సినిమా మంచి విజయం సాధించడం ఆ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించడంతో మొదటి నుండి సినీ ప్రేమికులు ఎఫ్ 3 మూవీ పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఎఫ్ 3 సినిమా విడుదలైన మొదటి రోజు నుండే ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర సాధించింది.

బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా ఈ రోజుతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దానితో ఎఫ్ 3 చిత్ర బృందం ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే ఈ ప్రత్యేక పోస్టర్ లో ఈ సినిమాథియేటర్ లలో 50 రోజులు పూర్తి చేసుకుంది అనే వివరాలను కూడా అధికారికంగా ప్రకటించింది . 10 సెంటర్ లలో ఎఫ్ 3 మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: