ఇటీవలికాలంలో బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా సూపర్ హిట్ అయిన సినిమాలను స్పూఫ్ చేయడం లేదా ఆ సినిమాలోని డైలాగులను మార్చి కామెడీ పంచటం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి చేయడం లో అటు హైపర్ ఆది ఎప్పుడు ముందుంటాడు. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో ఢీ లో టీం లీడర్ గా చేస్తున్నాడు హైపర్ ఆది. ఇక ఇటీవలే విడుదలైన ఢీ షో సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎప్పటిలాగానే అదిరిపోయే పర్ఫామెన్స్.. కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ ప్రోమోలో కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేజిఎఫ్ హీరో యాష్ ను ఇమిటేట్ చేసాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే హైపర్ ఆది చెప్పిన డైలాగ్స్  కాస్త ప్రస్తుతం ప్రోమో మొత్తంలో హైలెట్గా  మారిపోయింది అని చెప్పాలి.



 కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా లో యాష్ ఒక డైలాగ్ చెబుతాడు. వైలెన్స్ వైలెన్ వైలెన్.. ఐ డోంట్ లైక్.. ఐ అవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ అంటూ ఎంతో స్టైలిష్ గా చెప్పిన డైలాగ్ ప్రేక్షకులందరికీ కూడా గూస్బంప్స్ తెప్పించింది అన్న విషయం తెలిసిందే. ఈ డైలాగ్ సినిమా మొత్తానికి హైలెట్గా నిలిచింది. ఇకపోతే ఇటీవల ఏకంగా యాష్ లా మారిపోయిన హైపర్ ఆది ఇదే డైలాగ్ను కాస్త మార్చి చెప్పాడు. దీంతో ఇక ఈ డైలాగ్ ప్రోమో మొత్తం లో హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ హైపర్ ఆది ఎలా డైలాగ్ చెప్పాడంటే..



 శ్రద్ధ.. శ్రద్ధ.. శ్రద్ధ.. ఐ డోంట్ లైక్ శ్రద్దా.. ఐ అవాయిడ్.. బట్ శ్రద్దా  లైక్ మీ అంటూ తన వర్షన్ లో డైలాగ్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇకపోతే కొన్ని ఎపిసోడ్ నుంచి స్టార్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ఢీ షో లో జడ్జిగా అవతారమెత్తింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల విడుదలైన ప్రోమోలో చూసుకుంటే బ్లాక్ బస్టర్ స్పెషల్ అని థిమ్ తో ప్రేక్షకులను మరింత ప్రత్యేకంగా అలరించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రోమో లో భాగంగా పుష్ప,  ఉప్పెన లోని పాట డాన్స్ చేసారు కంటెస్టెంట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: