మెగా హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూసింది. అయితే మొదట ఈ సినిమా కథ ఒకటి అనుకుంటే మధ్యలో మార్పులు, చేర్పుల వలన మొత్తంగా మారిపోయిందని ఆ ఎఫెక్ట్ వలనే డిజాస్టర్ గా మారిందని...లేదంటే మొదట అనుకున్న కాన్సెప్ట్ కనుక అయితే రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా వార్తలే వినిపించాయి. అయితే ఈ చిత్రం లో మొదట చిరు సరసన హీరోయిన్ గా కాజల్ ని సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల కాజల్ పాత్రను అందులో నుండి తొలగించారు. ఇది కూడా సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు.

అంతేకాదు కాజల్ సినిమా లో కనిపించకపోవడంతో కొరటాల శివకు మరో పెద్ద నష్టం జరిగిందని అంటున్నారు. ఆచార్య సినిమా సౌత్ భాషల హక్కులను ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ భారీ మొత్తంలో డబ్బులు కుమ్మరించి ఆ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం లో కాజల్  ని తొలగించినందుకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అందులో మొత్తాన్ని కట్ చేయడంతో పాటు తెలుగు కాకుండా ఇతర భాషల హక్కులు కూడా వద్దని చెబుతూ వాటికి సంబంధించిన ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా కట్ చేసిందని ఇండస్ట్రీలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  

ఈ రకంగా మొత్తంగా ఏడున్నర కోట్ల రూపాయల ఆదాయం కాస్త కొరటాల శివ కు మిస్స్ అయ్యిందని తెలుస్తోంది.
ఇలా ఈ చిత్రం వలన దర్శకుడు కొరటాలకు చాలా షాక్ లే తగిలాయి అని అంటున్నారు.  ఇలా ఆచార్య సినిమా వలన  చాలానే నష్ట పోయారు. ఇటీవల ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు, బయ్యర్లు కూడా కొరటాల శివ ఆఫీస్ ముందర నానా రచ్చ చేయగా వారికి కూడా కొరటాల ఆరు కోట్ల వరకు ఇచ్చి సర్ది చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ గొడవ  కాస్త సద్దుమణిగింది. ఈ సినిమా కొరటాల శివ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇవన్నీ తట్టుకుని నిలబడాలి అంటే కొరటాల తదుపరి చిత్రం గొప్ప విజయం సాధిస్తే తప్ప పరిస్థితి మళ్ళీ ముందులా వుండదు అని అంటున్నారు..మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: