సదా.. ఒకప్పుడు జయం లాంటి సక్సెస్ సినిమాలో నటించి ప్రేక్షకుల మనసును దొచుకుంది.. ఆ సినిమా హీరో , హీరోయిన్లకు బాగా పేరును తీసుకొచ్చింది..దాని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఎన్నో హిట్ సినిమాల లో నటించి స్టార్ హోదాను అందుకున్నారు.నితిన్ ఇప్పటికీ సినిమాల తో ఫుల్ బిజిగా  వున్నాడు.సదాకు అవకాశాలు అందని ద్రాక్ష లాగా మారాయి.ఒకటో రెండో సినిమాలలో మెరుస్తుంది. ఇటీవల కాలంలో శ్రీమతి 21 ఎఫ్ సినిమాలో కనిపించింది. అయితే ఇప్పుడు సదా గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది..


ప్రస్తుతం నితిన్ నటిస్తున్న సినిమాలో సదాకు అవకాశం వచ్చిందని దానిని వద్దను కుందని వార్త చక్కర్లు కోడుతుంది..నితిన్ హీరోగా, కృతిశెట్టి, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. కొత్త డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా నుంచి ‘మాచర్ల సెంటర్‌లో.. రారా రెడ్డి ఐ యామ్ రెడీ..’ అంటూ సాగే మాస్ ఐటం సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ సరసన అంజలి ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.ఈ పాటకి ముందుగా సదానే అనుకున్నారట చిత్ర యూనిట్. అప్పుడు సదాతో నటించిన సాంగ్, సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడూ కూడా సదానే తీసుకొస్తే సినిమాకి మరింత హైప్ వస్తుందని భావించారు. దీంతో సదాని ఈ పాటలో చేయమని సంప్రదించారు. కానీ ఐటెం సాంగ్ కావడంతో సదా సున్నితంగా నో చెప్పడంతో చేసేదేం లేక అంజలిని ఓకే చేశారు..


ఈ పాట చివర్లో నితిన్ ఫస్ట్ సినిమా జయంలోని ఫేమస్ సాంగ్ ‘రాను రానుంటూనే చిన్నదో..’ లిరిక్స్‌ను జత చేశారు. దాదాపు ఆ పాటలోని పల్లవి మొత్తాన్ని రీమిక్స్ చేసి ఈ పాటకి జత చేయడంతో రారా రెడ్డి ఐ యామ్ రెడీ పాట మరింత వైరల్ గా మారింది. ఇందులో అంజలి, నితిన్ కలిసి చేసిన మాస్ స్టెప్పులు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇది చూసి నితిన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆగస్టు 12న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలని మొదలుపెట్టేశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: