సినీ రంగంలో ఎంతోమంది దర్శకులు నటీనటులు వస్తూనే ఉంటారు. ఒక డైరెక్టర్ కు ఉన్న ఆలోచన మరొక డైరెక్టర్ కి ఉండదని చెప్పవచ్చు. అయితే కొంతమంది దర్శకులు సైతం నటులుగా మారేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా ప్రస్తుతం యాక్టర్ సముద్రఖని ప్రస్తుతం ఏ స్థాయిలో క్రేజ్ ను  అందుకున్నాడో మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే తరహాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ కూడా సినిమాలలో ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ఈ డైరెక్టర్ పేరు వినగానే అందరికీ ఎక్కువగా లవ్లీ రొమాంటిక్ చిత్రాలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి.


ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే ఏం మాయ చేసావే సినిమాతో పాటు ఘర్షణ సినిమా ఒక మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ ఒక లవ్ స్టోరీని తెరపైకి తీసుకువస్తున్నారంటే చాలు కచ్చితంగా ఒక వర్గం ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుందని అందరి నమ్మకం. అయితే ఇటీవల కాలంలో మాత్రం డైరెక్టర్ గా కంటే ఎక్కువగా నటుడుగానే సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంలో ఒరిజినల్ పాత్రలో నటించారు.


డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ తబల సినిమాలలో ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ఎక్కువగా తన సినిమాల్లోనే కాకుండా ఇతర డైరెక్టర్ల కోరిక మేరకు పలు సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా సీతారాం చిత్రంలో కూడా మేజర్ సెల్వన్ పాత్రలో కనిపించబోతున్నారు అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి  డైరెక్టర్ అను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో హీరో సుమంత్ కూడా నటిస్తున్నారు. ఇక డైరెక్టర్ గౌతమ్ వాసుదేవకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫస్ట్ లుక్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: