ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, సీనియర్ హీరోయిన్ రాధిక మాజీ భర్త అయిన ప్రతాప్ పోతేన్ మరణ వార్త ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  70 ఏళ్ళు వయసున్న ప్రతాప్ చెన్నైలోని తన నివాసంలో ఒంటరిగా నివసిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. పేరుకి తమిళ నటుడు అయిన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులోను ఈయన అందరికీ బాగా సుపరిచితులే. ఆకలి రాజ్యం చిత్రం లో ఈయన నటన తెలుగు ప్రేక్షకుల హృదయానికి చేరువ చేసింది.

కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ప్రతాప్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీకి సేవలను అందించారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా చివరికి ఒంటరిగానే మరణించారు ప్రతాప్. మొదట సీనియర్ హీరోయిన్ రాధికను 1985 లో వివాహం చేసుకోగా పెళ్లయిన ఏడాదికే వీరు విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడమే మేలు అనుకున్నారు.  ఆ తరువాత ప్రతాప్ అమల సత్యనాథన్ ను మరియు రాధిక హీరో శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుని వారి జీవితాల్లోకి వెళ్లిపోయారు. 1990 లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. అయితే రెండో పెళ్లి కూడా ఆయనకు కలిసి రాలేదనే చెప్పాలి. అమల సత్యనాథన్ తో కూడా 2012 లో విడాకులు తీసుకుని విడిపోయారు.  

కాగా అప్పటి నుండి ఒంటరిగానే లైఫ్ ను లీడ్ చేస్తున్న నటుడు ప్రతాప్ శుక్రవారం రోజు తుది శ్వాస విడిచారు. అయితే ప్రస్తుతం తన ఇద్దరు భార్యలు అయిన రాధికా శరత్ కుమార్ మరియు అమల సత్యనాధన్ లు ఎంతో కొంతకాలం తనతో కలిసి ఉన్నారు. కాబట్టి ఈ రోజు చాలా బాధను దిగమింగుకుని ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: